Monday, October 10, 2011

రుద్రాక్షలు

 మన హిందువులలో "రుద్రాక్ష" పేరు విననివారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఐతే ఈ రుద్రాక్షలు ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమీటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు.

        రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. ఈ వృక్ష సాంకేతిక నామం (scientific name) Elaeocarpus Granitrus. రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాలలో, నేపాల్ లో మరియూ ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. ఈ వృక్షం పెరిగి పుష్పించి ఫలించటానికి కనీసం 15 నుండి 16 సంవత్సరాలు పడుతుంది.

        పురాణ కథ:

        "రుద్రాక్ష" అనే పదం రుద్ర + అక్ష అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. రుద్రాక్ష అనగా రుద్రుని అశ్రువులు (కన్నీటి బొట్లు) అని అర్ధం. రుద్రాక్షల గురించి వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీ పురాణం, పద్మ పురాణం, మరియు రుద్రాక్ష జబలోపనిషత్ లలో వివరంగా చర్చింపబడింది.

        శివపురాణం ప్రకారం రుద్రాక్ష పుట్టుక ఇలా ఉంది.

        రాక్షసరాజైన త్రిపురాసురుడు వరబలం వలన అత్యంత శక్తివంతుడై, దేవతలకు కంటకుడిగా మారాడు. దేవతలంతా పరమ శివుని వద్దకు వచ్చి తమ బాధలు మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడూ త్రిపురాసుర సంహారం కోసం అత్యంత శక్తిమంతమైన ' అఘోరాస్త్రం ' తయారుచేయదలచి సమాధిలోకి వెళ్ళిపోయాడు. అలా సమాధిలోకి వెళ్ళిన పరమశివుడు చాలా కాలం తరువాత కళ్ళు తెరచినప్పుడు శివుని కన్నుల నుండి కొన్ని ఆశ్రు బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి వాటి నుండి రుద్రాక్ష వృక్షాలు పుట్టాయి. రుద్రాక్ష చెట్టు నుండి వచ్చే ఫలాలలో ఉండె బీజములే మనం రుద్రాక్షలని అంటాము.

        పరమశివుని త్రినేత్రములు సూర్య, చంద్ర, అగ్ని రుఫాలు. అందులో సూర్యనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు గోధుమరంగులో (Brown) ఉంటాయి. ఇవి పన్నెండు రకాలు. చంద్రనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు లేత ఎరుపురంగులో ఉంటాయి. ఇవి మొత్తం 16 రకాలు. అగ్ని నేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు నల్లగా ఉంటాయి. ఇవి మొత్తం 10 రకాలు. సూర్యనేత్రం నుండిపుట్టిన గోధుమరంగు రుద్రాక్షలను లేత గోధుమరంగు రుద్రాక్షలు, ముదురు గోధుమరంగు రుద్రాక్షలు గా విభజించ వచ్చు. అన్ని రకాల రుద్రాక్షలు కలిపి మొత్తం ముప్పైఎనిమిది రకాల రుద్రాక్షలు మనకు దొరుకుతున్నాయి. ఎవరైతే 108 రుద్రాక్షలను ధరిస్తారో వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుందని, వారి 21 తరాలవారు శివలోక సాయుజ్యం పొందుతారని, ఎవరైతే 1100 రుద్రాక్షలని ధరించినా, 555 రుద్రాక్షలను కిరీటంలా ధరించినా, 320 రుద్రాక్షలను జంధ్యంగా మూడు వరుసలో ధరించినా వారు పరమశివునితో సమానమని పురాణాలు చెప్తున్నాయి.

        రుద్రాక్షలు - రకాలు


        ముందుగా చెప్పినట్టు మనకు మొత్తం 38 రకాల రుద్రాక్షలు దొరుకుతున్నాయి. రుద్రాక్షల విలువ వాటీ ప్రమాణాన్ని బట్టి ఉంటుంది. మినుము గింజప్రమాణం గల రుద్రాక్షలకు చాలా రోగనిరోధక శక్తులున్నాయని, ఆధ్యాత్మిక చింతనకు శ్రేష్ఠమైనవని శాస్త్రం. భారతదేశంలో దిగువ హిమాలయాలలో లభించే రుద్రాక్షలు పరిమాణంలో చిన్నవి. నేపాల్ లో లభించే రుద్రాక్షలు పెద్దవిగా ఉంటాయి.

        "పత్రి" అనే రుద్రాక్ష చదునుగా ఉండే ఒక విషేషమైన రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ప్రస్తుతం అంత విరివిగ లభించటంలేదు.

        ప్రత్యేకమైన రుద్రాక్షలలో చెప్పుకోదగినవి "గణేష రుద్రాక్ష""గౌరీ-శంకర రుద్రాక్ష".


 వివిధ రుద్రాక్షలను వాటి ' ముఖాల ' ద్వారా గుర్తించవచ్చు. ఒక రుద్రాక్ష ఎన్ని ముఖాలదో తెలుకోవాటానికి సులభమైన మార్గం ఏమిటంటే ! ఆ రుద్రాక్షమీద ఎన్ని గీతలున్నాయో అది అన్ని ముఖాల రుద్రాక్ష.


        పురాణాలు వివిధ రుద్రాక్షలను వివిధ దేవతలతో పోల్చారు. అందరికి సులభంగా ఉండటానికి ఈ క్రింది పట్టికలో పొందుపరుస్తున్నాను.

ముఖాలు
        
దేవత
        
సంబంధిత గ్రహం
        
సంభందిత మంత్రం
ముఖిశివుడు / సూర్యుడుసూర్యుడుఓం హ్రీం నమః
ముఖిఅర్ధనారీశ్వరుడుచంద్రుడుఓం నమః
ముఖిఅగ్నికుజుడుఓం క్లీం నమః
ముఖిబ్రహ్మబుధుడుఓం హ్రీం నమః
ముఖికాలాగ్ని రుద్రగురుడుఓం హ్రీం నమః
ముఖికార్తికేయుడుశుక్రుడుఓం హ్రీం హూం నమః
ముఖిఅనంగశనిఓం హూం నమః
ముఖిగణేషరాహుఓం హూం నమః
ముఖిభైరవుడుకేతుఓం హ్రీం హూం నమః
10 ముఖివిష్ణుమూర్తిబుధుడుఓం హ్రీం నమః
11 ముఖిఏకాదశ రుద్రులుకుజుడు/గురుడుఓం హ్రీం హూం నమః
12 ముఖిఆదిత్యుడుసూర్య్డుఓం క్రీంశ్రూమ్రూం నమః
13 ముఖికార్తికేయుడుకుజుడుఓం హ్రీం నమః
14 ముఖిశివుడు / హనుమంతుడుశనిఓం నమః
21 ముఖికుబేరుడు----


 జన్మ నక్షత్రం - సరిపడే రుద్రాక్షలు


        జన్మపత్రిక ననుసరించి ఆయా జన్మ నక్షత్రకులకు సంబంధిత రుద్రాక్షలను ధరించటంవలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ దిగువన జన్మనక్షత్ర పరంగా ధరించవలసిన రుద్రాక్షలు ఇవ్వబడినాయి.


జన్మ నక్షత్రం        రాశి అధిపతి        ధరించవలసిన రుద్రాక్ష
అశ్వనికేతుముఖి
భరణికుజుడుముఖి మరియు 11 ముఖి
కృత్తికరవిముఖి మరియు 12 ముఖి
రోహిణిచంద్రుడుముఖి
మృగశిరకుజుడుముఖి మరియు 11 ముఖి
ఆరుద్రరాహుముఖి
పునర్వసుగురుడుముఖి
పుష్యమిశని14 ముఖి
ఆస్లెషబుధుడుముఖి
మఖకేతుముఖి
పూర్వ ఫాల్గుణిశుక్రుడుముఖి మరియు 9 ముఖి
ఉత్తర ఫాల్గుణిరవిముఖి మరియు 12 ముఖి
హస్తచంద్రుడుముఖి
చిత్రకుజుడుముఖి మరియు 11 ముఖి
స్వాతిరాహుముఖి
విశాఖగురుడుముఖి
అనురాధశని14 ముఖి
జ్యేష్ఠబుధుడుముఖి
మూలాకేతుముఖి
పూర్వాషాఢశుక్రుడుముఖి మరియు 9 ముఖి
ఉత్తరాషాఢరవిముఖి మరియు 12 ముఖి
శ్రావణచంద్రుడుముఖి
ధనిష్టకుజుడుముఖి మరియు 11 ముఖి
శతభిషరాహుముఖి
పూర్వాభాద్రగురుడుముఖి
ఉత్తరాభాద్రశని14 ముఖి
రేవతిబుధుడుముఖి


రుద్రాక్ష ధారణవలన కలిగే సత్ఫలితాలు


        పురాణాల ననుసరించి వివిధ ముఖాల రుద్రాక్షలు ధరించటంవలన కలిగే ఫలితాలు క్రింద ఇవ్వబడ్డాయి. గమనించవలసింది ఏమిటంటే రుద్రాక్షలు ధరించటం వలన ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు.


ముఖాలు
ఫలితాలు
ముఖిసర్వతోముఖ అభివృద్ధిఅన్ని పాపాలను హరించి అన్ని కోరికలను సిద్ధింపచేస్తుంది.
ముఖిసౌభాగ్య ప్రదాయనిసర్వపాపహారిణి రుద్రాక్ష ఏకత్వాన్ని సూచిస్తుందిదుష్ట ఆలోచనలుఅదుపుచేస్తుందివైవాహిక సంబంధాలను మెరుగు పరుస్తుంది.
ముఖిసకల సౌభాగ్య దాయనితరచుగా వచ్చే జ్వరం వంటి వ్యాదులనుండి ఉపశమనం
ముఖిధర్మార్ధ కామ మోక్ష ప్రదాయనిమానవుడు హత్య ద్వారా చేసిన పాపాన్ని హరిస్తుంది.జ్ఞాపకశక్తి నితెలివితేటలను పెంపొందిస్తుందినరాలకు సంబంధించిన వ్యాధులకు మంచిది
ముఖికోపాన్ని అదుపుచేసి మనసుకు శాంతిని కలగ చేస్తుందిరక్తపోటుచెక్కెర వ్యాధిపంటినొప్పులు మూల వంటి వ్యాదులను నివారిస్తుంది.
మిఖికుడి చేతికి కట్టుకుంటే Low BP తగ్గుతుందిబ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి
ముఖిధన మరియు అభివృద్ధిని ప్రసాదిస్తుంది
ముఖిప్రమాదాల నుండిఆపదల నుండి రక్షణ
ముఖివివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తిఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది
10 ముఖినరాలకు సంబంధించిన వ్యాధులకుజ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది
11 ముఖిసంతాన ఆరోగ్య సమస్యలకు మంచిది
12 ముఖిరక్తహృదయ సంబంధిత వ్యాధులకు మంచిదిధైర్యాన్ని పెంచి శత్రువుల నుండి రక్షణకలిగిస్తుంది
13 ముఖిఅభివృద్ధిఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది
14 ముఖిశని సంబంధిత సమస్యలకు మంచిది.

1 comment:

Shakthi said...

namase D S gaaru __/\__

rudrakshalO inni rakaalu unnaayani chaalaabaagaa telipaarandii aarogyaniki enta upayogamo baagaa chepaaru chaalaa thankse andii vivarangaa rudraksha gurinchi telipinanduku