Saturday, August 27, 2011

చిన్న మాట

పుట్టిన ప్రతిమనిషికి మనసులో ఎన్నెన్నోభావాలు, ఎన్నెన్నొ ఆలోచనలు. ప్రతిమనిషి ఈ భావాలకి, అనుభవాలకి, ఆలోచనలకి తనదైన పద్దతిలో స్పందిస్తాడు. కొందరు కవులైతే మరికొందరు కళాకారులవుతారు. ఇంకొంతమంది విమర్శకులైతె, కొంతమంది తటస్తంగానే ఉండిపోతారు. ఈ విరుద్ధ భవ ప్రదర్శన వారివారి మానసిక పరిపక్వతని బట్టి ఉంటుంది. ఐతే కొన్ని సంఘటనలు అందరినీ ఒకే విధంగా స్పందింపచేస్తాయి. నా ఈ బ్లాగు నాలో చెలరేగే ఆలోచనలకు, భావాలకు, స్పందనలకు ప్రతిరూపంగా మీముందు ఉంచుతున్నాను. 

ఈ బ్లాగులో ఒక విషయం అని కాకుండా ఎన్నో విషయాలకు నా స్పందనే కాకుండా చాల కొత్త విషయాలను కూడా చేర్చి ఒక ఆసక్తికరమైన బ్లాగుగా ఉంచటానికి ప్రయత్నిస్తాను. మీ ఆలోచనలు, భావనలు, విమర్శలు నాతో పంచుకోమని  నా విన్నపం.