Tuesday, September 10, 2013

మా చుట్టాలే

అప్పుడెప్పుడో ఒకసారి హైదరాబాదు వెళ్ళినప్పుడు (అదేలేండి ఈమద్య 3 నెలలక్రితం) అలా కోటికి వెళ్ళా. అలా విశాలాంధ్రా కి వెళ్ళి అక్కడనుంచి ఆంధ్రాబ్యాంకు మీదిగా కోటి హాస్పిటల్ దగ్గరకువచ్చి అక్కడే ఉన్న పుస్తకాలు అమ్మే షాపులోకి దూరా. అవి ఇవి చూస్తూ అక్కడే ఉన్న మేడం ని శతకాలమీద ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని అడిగాను. ఆపక్కనే ఉన్నాయి అంటు చూపించారు. అక్కడున్నవి చూసి "ఇవన్నీ నాదగ్గర ఉన్నాయండి. వావిళ్ళ వారు "భక్తిరస శతకసంపుటము" అని 5 సంపుటాలు ప్రచురించారు వాటికోసం వెతుకుతున్నా" అన్నాను. "లేవండి. మేరొకపనిచేయండి. ఇంటర్నెట్లో మీకు దొరుతాయి. మీకు సైట్ పేరు ఇస్తాను అన్నాను" అన్నారు
అహా అనుకుని "చెప్పండి" అన్నాను
SatakasAhityaM.blogspot.com అని ఒక కాగితం మీద వ్రాసి ఇచ్చి ఇందులో చూడండి దొరుకుతాయి. ఈ సైట్ మాచుట్టాలదే. సుబ్రమణ్యం గారని" అంటు చెప్పుకొచ్చారు.
"ఒహో అలాగా. ఎక్కడుంటారు " అని అడిగా.
"హైదరాబాదే" అన్నారు ధీమాగా.
" చూస్తానండి. ధన్యవాదములు. ఈలోగా ఏమైనా శతకాల పుస్తకాలు వస్తే కొంచం ఇన్ఫార్మ్ చేస్తారా "
"మీ పేరు మైయిల్ ఇవ్వండి చెప్తా "అన్నారు ఆమె
వ్రాసిచ్చాను. "ఒహో మీ పేరుకూడ సుబ్రమణ్యమేనా" అన్నారు.
" అవునండి మీరు చెప్పిన ఆ చుట్టాన్ని నేనే మరి" అంటు బయటకు కదిలాను.
(ఇది నిజంగా జరిగిన సంఘటన. నాకుతెలియని ఈ కొత్త చుట్టం ఎవరబ్బా అని కాసేపు మైండు బ్లాకైన మాట వాస్తవం)

5 comments:

said...

SatakasAhityaM.blogspot.com this seems to be not working. can you give exact url?

thank you.

Tejaswi said...

బాగుంది మీ అనుభవం.

D. Subrahmanyam said...

http://shatakashityam.blogspot.in/

సుబ్రహ్మణ్యం నిష్ఠల. said...

మధురమైన మన తెలుగుభాషను ఇంత చక్కగా ఆసక్తి కలిగేటట్లు వ్యాప్తి చేయుట అభినందనీయము. మీ కష్టసాధ్యమైన కృషికి నా కృతజ్ఞతాభినందనలు.

dokka srinivasu said...

సుబ్రహ్మణ్యం గారూ నమస్కారము. సుబ్రహ్మణ్యం గారూ ఇది నేను సేకరించిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారు (అన్నపూర్ణ) ప్రత్యేక తపాలా కవరు. ఈ ప్రత్యేక తపాలా కవరుని తూర్పు గోదావరి జిల్లా స్టాంపులు మరియు నాణేల సేకరణ కర్తల అసోసియేషన్ ఇటీవల జరిగిన సేకరణల ఎక్సిబిషన్ సందర్భముగా విడుదల చేసింది. ఈ కవరుని నేను నా భారతీయ సంస్కృతి బ్లాగులో షేర్ చేసాను. సుబ్రహ్మణ్యం గారూ ఈ పోస్టుని చూసి మీ కామెంట్స్ తెలుగులో ఇవ్వగలరు. అలాగే మీకు నా భారతీయ సంస్కృతి బ్లాగు కనుక నచ్చితే నా బ్లాగులో మెంబర్ గా జాయిన్ అవ్వగలరు అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చెయ్యగలరు.

http://indian-heritage-and-culture.blogspot.in/2015/10/srimati-dokka-seethamma-garu-annapurna.html