Monday, November 21, 2011

కల్యాణ ప్రదమైన కల్యాణి రాగం


కర్నాటక సంగీతంలో ప్రసిద్ధరాగాలలో కల్యాణి రాగం ఒకటి. ఈ రాగం 65వ మేళకర్త ప్రతిమధ్యమ రాగం.సంపూర్ణ రాగం. కటపయాది సూత్ర ప్రకారం 11వ చక్రమైన ఆదిత్య చక్రంలో 5వరాగం, మేచకల్యాణి గా వ్యవహరిస్తారు. శుద్ధమధ్యమ రాగాల్లో శంకరాభరణం ఈ రాగానికి సమానం. అంటే ప్రతిమధ్యం బదులు శుద్ధమధ్యమం వాడితే శంకరాభరణరాగం అవుతుంది. ఈ రాగం హిందుస్థానీ సంగీతంలో యమన్ గా ప్రసిద్ధి చెందింది.
ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు ఈ ప్రకారంగా ఉంటాయి.


సడ్జమము(స), చతుశ్రుతి రిషభము(చ.రి), అంతర గాంధారం(అం.గా), ప్రతి మధ్యమం(ప్ర.మ), పంచమం(ప),చతుశ్రుతి ధైవతం(చ.ధై), కాకలి నిషాదం(కా.ని).


దక్షిణ భారతదేశంలో పెళ్ళిళ్ళు మెదలైన శుభకార్యాలలో ఈ రాగం చాలా తరచుగా వినిపిస్తుంది.  కల్యాణప్రదమైన ఈ రాగంలో అందరు వాగ్గేయకారులు రచనలు చేసారు. వాటిలోకొన్ని:


1. వనాజాక్షీరో - అట తాళ వర్ణం - పల్లవి గోపాల అయ్యార్
2. నిధిచాలా సుఖమా - త్యాగరాజు
3. ఏ తావునరా నిలకడ నీకు -త్యాగరాజు
4. సుందరినీ దివ్య రూపమును చూడ - త్యాగరాజు
5. అమ్మ రావమ్మ తులసమ్మ - త్యాగరాజు
6. వాసుదేవయని వెడలిన - త్యాగరాజు
7. కమలాంబాం భజరే - ముత్తుస్వామి దీక్షితార్
8. హిమాద్రి సుతే పాహిమాం - శ్యామశాస్త్రి


ఇలాంటి ఎన్నో ప్రసిద్ధ రచనలు వాగ్గేయకారులచే చేయబడ్డాయి. 


కర్నాటక సంగీతంలోనే కాక చలన చిత్రసంగీతంలో కూడా ఈ రాగాం చాలా ప్రసిద్ధి కెక్కింది. ఇళయరాజా గారు ఈ రాగంలో ఎన్నో తమిళ పాటలకు సంగీతం కూర్చారు. హింది చలన చిత్రాలలో కూడా ఈ రాగలోని పాటలు అత్యంత ప్రసిద్ధి చందాయి. వాటిలో కొన్ని:


1. మన్ రే, తుకాహె న ధీర్ ధరే - చిత్రలేఖ
2. జిందగీ భర్ నహీ భూలేగి బర్సాత్ కి రాత్ - బర్సాత్ కి రాత్
3. ఆసూ భరీ హై  యే జీవన్ కి రాహే - పర్వరిష్


ఇక తెలుగులో ఈ రాగంలో అత్యంత జనరంజకమైన పాటలు ఉన్నాయి: వాటిలో కొన్ని:


1. మనసున మల్లెల మాలలూగెనే (మల్లీశ్వరి)(ఇక్కడ వినండి)
2. సావిరహే తవదీనా రాధ (విప్రనారాయణ) (ఇక్కడ వినండి)
3. జగమే మారినది మధురముగా ఈ వేళ (దేశద్రోహులు) (ఇక్కడ వినండి)
4. మది శారదా దేవి మందిరమే (జయభేరి) (క్కడ వినండి)
5. తోటలో నారాజు (ఏకవీర) (ఇక్కడ వినండి)
6. సలలిత రాగ సుధా రస సారం (నర్తనశాల) (ఇక్కడ వినండి)
7. ఎప్పటి వలే కాదురా నా స్వామి (అభిమానవంతుడు) 
8. జోరుమీదున్నావు తుమ్మెదా (శివరంజని) (ఇక్కడ వినండి)
9. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ (దేవదాసు) (ఇక్కడ వినండి)
10. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో (సంతానం) (ఇక్కడ వినండి)
11. తొలివలపే పదే పదే పిలిచే (దేవత) 
12. పూచే పూలలోనా (గీత) 
13. రావే నా చెలియా ..చెలియా (మంచిమనసుకు మంచిరోజులు) (ఇక్కడ వినండి)
14. దొరకునా ఇటువంటి సేవ (శంకరాభరణం) (ఇక్కడ వినండి)
15. పూవై విరిసిన పున్నమి వేళ (తిరుపతమ్మ కథ) (ఇక్కడ వినండి)
16. ఎవరివో నీవెవరివో (పునర్జన్మ) ()
17. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా (దళపతి) (ఇక్కడ వినండి)
18. ఏదో తెలియని బంధమిది ఎదలో ఒదిగిన రాగమిదీ (నాయకుడు) (ఇక్కడ వినండి)
19. నా ఊపిరీ నీవేనులే దేవదేవా (పోలీస్ డైరీ) 
20. ఈనాడే ఎదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగనిదీ (ప్రేమ) (ఇక్కడ వినండి)
21. హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి ...(తారకరాముడు) 
22. సుందరి నేనే నువ్వంట (దళపతి) (ఇక్కడ వినండి)
23. రారా నా సామి రారా (విప్రనారాయణ) (ఇక్కడ వినండి)
24. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా (మాతృదేవత) (ఇక్కడ వినండి)
25. పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని (పెళ్ళిచేసి చూడు) (ఇక్కడ వినండి)
26. పాడనా వాణి కళ్యాణి గా (మేఘసందేశం) (ఇక్కడ వినండి)
27. మాణిక్యవీణాం ముఫలాలయంతీం (మహాకవి కాళిదాసు)


ఇలా చెప్పుకొంటూపోతే అంతే ఉండదు. ఈ రాగానికి ఇది చిన్న ఉపోద్ఘాతం మాత్రమే. 
(తప్పులుంటే మన్నించండి)

2 comments:

జ్యోతి said...

ధాంక్స్ అండి.. కళ్యాణి రాగంలో వందకు పైగా పాటలు ఉన్నాయి తెలుగు హిందీలో..:))

మీరు పాటలకు ఆడియో లింక్ ఇవ్వాల్సింది. పాట వింటే ఆ రాగం గురించి మరింత వివరంగా అర్ధమవుతుందేమో కదా..

D.Subrahmanyam said...

థాంక్స్ జ్యోతిగారు. మీరన్నట్లుగా ఈ రాగంలో వందలలోనే పాటలున్నాయి. ఉదాహరణకి కొన్ని మాత్రమే ప్రస్తావించాను. మీ ఆడియో లింకుల సూచన బాగుంది, త్వరలో లింకులు ఇస్తాను, మరోమారు ధన్యవాదములు.